కొయ్యూరు ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ భారీ కొండచరియలు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మతల్లి వద్ద ఎన్ హెచ్ 516 ఈ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. రహదారిపై పడిన మట్టిని, రాళ్లను అధికారులు తక్షణమే తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.