ఎడ్ల బండిపై వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించిన స్థానికులు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం గణనాథుడిని సంప్రదాయబద్ధంగా ఎడ్ల బండిపై నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పడమటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం కళకళలాడేలా చూడాలని స్వామివారిని ప్రార్థించారు.