అమెరికాలో అరుదైన గౌరవం: కీలక పదవిలో భారతీయ సంతకపు నేత అజయ్ భుటోరియా

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

అమెరికాలో భారతీయ అమెరికన్ అయిన అజయ్ భుటోరియాకి అరుదైన గౌరవం దక్కిందని, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఆయనను రెగ్యులేటరీ బోర్డు సభ్యునిగా నియమించారని అధికారులు తెలిపారు. ప్రొఫెషనల్ ఇంజినీర్లు, ల్యాండ్ సర్వేయర్లు, జియాలజిస్టులతో కూడిన ఈ బోర్డు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల భుటోరియా హర్షం వ్యక్తం చేస్తూ, సాంకేతికతను ఉపయోగించి పాలనా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.