మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ పై సామూహిక అత్యాచారం కేసు నమోదు
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని థానే జిల్లాలో మాజీ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్, సస్పెండ్ అయిన పోలీసు కానిస్టేబుల్ శైలేష్ పాటిల్ లపై 22 ఏళ్ల యువతిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. భివండిలోని బాప్గావ్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా, తనపై వచ్చిన ఆరోపణలను నరేంద్ర పవార్ ఖండించి పార్టీ పదవులకు రాజీనామా చేశారు.