బ్రిక్స్ సదస్సు విందును బహిష్కరించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందును చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రాత్రి గైర్హాజరయ్యారు. తొలి రోజు సమావేశాలు మరియు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న ఆయన, సడన్ గా విందు కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.