ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు ఆర్థిక సాయం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శ

రిపోర్టర్: శివ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ములగూడ గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ కొడప దుర్గా మారుతి కుటుంబాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు. కష్టకాలంలో పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు.