అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రముఖ మీడియా సంస్థల న్యాయపోరాటం

రిపోర్టర్: నరేష్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వైట్ హౌస్ ప్రవేశంపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి ప్రముఖ మీడియా సంస్థలు వాషింగ్టన్ డిసి లో ఫెడరల్ దావా వేశాయి. తమ రిపోర్టింగ్ నచ్చలేదన్న కారణంతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ వైట్ హౌస్ యాక్సెస్ నిలిపివేశారని ఆ సంస్థలు ఆరోపించాయి. ఈ వివాదం నేపథ్యంలో ఏబీసీ, సీబీఎస్, ఫాక్స్ న్యూస్, ఎన్బీసీ వంటి ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు ప్రెసిడెన్షియల్ టెలివిజన్ పూల్ కవరేజ్‌ను నిలిపివేస్తూ నిరసన తెలిపాయి.