బెంగళూరు విమానాశ్రయంలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
రిపోర్టర్: గోపి
స్థలం: బెంగళూరు
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గువాహటి నుంచి వచ్చిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిందని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో ఎదురైన బలమైన గాలుల కారణంగా విమానం వెనుక భాగం రన్‌వేను గట్టిగా తాకడంతో టెయిల్ స్ట్రైక్ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే మొదటి ప్రయత్నాన్ని నిలిపివేసి, గో-అరౌండ్ ప్రక్రియ ద్వారా విమానాన్ని సురక్షితంగా గాల్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించడంతో ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడ్డారు.