అల్లూరి జిల్లాలో మహిళల భద్రతపై పోలీస్ శాఖ అవగాహన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహిళల భద్రత, సైబర్ భద్రత మరియు గంజాయి నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అల్లూరి పోలీస్ అధికారులు వెల్లడించారు. మాంప, అరకు మరియు అనంతగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు భద్రత, మహిళా సాధికారతతో పాటు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈజిగల్ సహకారంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని అల్లూరి పోలీస్ అధికారిక ఖాతా ద్వారా స్పష్టం చేశారు.