టెక్ దిగ్గజానికి షాక్: తల్లిదండ్రుల కోసం మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ రాజీనామా

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

మైక్రోసాఫ్ట్ సంస్థలో ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించిన వైస్ ప్రెసిడెంట్ కేశవన్ షణ్ముగం తన పదవికి రిటైర్మెంట్ ప్రకటించారని లింక్డ్ఇన్ వేదికగా వెల్లడించారు. వృద్ధులైన తల్లిదండ్రులతో గడిపేందుకు భారతదేశానికి తిరిగి వస్తున్నానని, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్సెల్ కోపైలట్, ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కీలక తరుణంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం టెక్ వర్గాలలో చర్చనీయాంశమైంది.