పది లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన చైర్పర్సన్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో ఎమ్మెల్యే సీఎస్ఆర్ నిధులు పది లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టంగా సూచించారు.