టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఈడీ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన ఎంఎస్ సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ మంగళ చంద్‌ను అరెస్ట్ చేసి విశాఖ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మనీ లాండరింగ్ కోణంలోనూ ఈడీ అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.