రైతన్నలకు తీపి కబురు: తుపాను బాధితులకు పంటల బీమా భరోసా
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
అర్నబ్ తుపానుతో నష్టపోయిన రైతన్నలకు పంటల బీమా ద్వారా తగిన భరోసా లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఖరీఫ్ పంట కాలానికి 22 రకాల నోటిఫైడ్ పంటలకు సంబంధించి 17.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు ప్రీమియం చెల్లించగా, మొత్తం రూ.15,969 కోట్ల మేర బీమా కవరేజి అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 16 జిల్లాల్లోని సుమారు 4.10 లక్షల హెక్టార్లలో పంటలు నీటమునిగినట్లు వెల్లడించారు.