గడ్డిపాడు రోబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు
రిపోర్టర్: మహేష్
స్థలం: గుంటూరు
రూపాయిల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న గడ్డిపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న గారిని కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా గుంటూరు మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ మరో కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.