భారత టెక్నాలజీ భవిష్యత్తుపై గ్లోబల్ జీఎస్ఎంఏ బోర్డుతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: గుంటూరు
జీఎస్ఎంఏ బోర్డు సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొనడం ఎంతో గర్వకారణమని కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భవిష్యత్తు టెక్నాలజీ అత్యంత సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారని ఆయన తెలిపారు. అంతర్జాతీయ నిబంధనలలో సమన్వయం పెంచుతూ, ఆన్లైన్ మోసాలు, స్పామ్‌లను పూర్తిగా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు.