'గర్వం ప్రదర్శిస్తున్నారు': భారత మహిళా క్రికెట్ జట్టుపై మహమ్మద్ యూసఫ్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

మహిళా ఆసియా కప్ ఫైనల్ విజయం తర్వాత ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. జాతీయ గర్వం అహంకారంగా మారినప్పుడు విజయానికి తగిన గుర్తింపు లభించదని, వినయం లేని దేశం ఓడిపోయినట్లేనంటూ మహమ్మద్ యూసఫ్ ఎక్స్ వేదికగా భారత్ తీరును విమర్శించారు.