శబరిమలలో ఆరవణ పాయసం కొరతపై కేరళ మంత్రి మురళీధరన్ ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: కేరళ
శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయంలో ఆరవణ పాయసం కొరత ఏర్పడటంపై కేరళ దేవస్వం శాఖ మంత్రి మురళీధరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రా సీజన్‌కు ముందు యంత్రాల నవీకరణ పనులు చేపట్టి భక్తులకు ఒక్కో టిన్ మాత్రమే ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. భక్తులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.