తిరుపతిలో వక్కలతో అద్భుతమైన వినాయక విగ్రహం తయారీ
రిపోర్టర్: హరి
స్థలం: తిరుపతి
వినాయక చవితిని పురస్కరించుకుని తిరుపతిలో పర్యావరణహిత విగ్రహం తయారైంది. కరకంబాడి మార్గంలో కళాకారుడు రాము కుటుంబ సభ్యులు 46 కిలోల వక్కలతో ఏడడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. నిమజ్జన సమయంలో పర్యావరణం కలుషితం కావొద్దనే ఉద్దేశంతో కడప నుంచి ప్రత్యేక వక్కలు తెప్పించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీని తయారీకి 15 రోజులు పట్టిందని, రూ.1.10 లక్షల ఖర్చు అయ్యిందని నిర్వాహకులు తెలిపారు.