బిగ్ బాస్ కొత్త సీజన్ పై అసిమ్ రియాజ్ విమర్శలు

రిపోర్టర్: హరి స్థలం: India

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైన తరుణంలో మాజీ కంటెస్టెంట్ అసిమ్ రియాజ్ షోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సీజన్‌ను విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి, తర్వాత దానిని తొలగించారు. అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోపై అనవసర విమర్శలు మాని ముందుకు సాగాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.