ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ నిప్పులు

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సంఘం ప్రకటించిన అరకొర చర్యలు సమస్యకు పరిష్కారం కాదని, ఇప్పటికే జరిగిన పరిణామాలపై నష్ట నివారణ ప్రయత్నమేనని ఆయన మండిపడ్డారు. పాక్షికంగా చేసే దిద్దుబాటు చర్యల వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని, పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.