పోలీస్ స్టేషన్లోనే మహిళపై అత్యాచారం: ఝార్ఖండ్లో కలకలం రేపిన దారుణ ఘటన

రిపోర్టర్: వెంకట్ స్థలం: సెరైకేలా

ఝార్ఖండ్లోని సెరైకేలా ఖర్సావాన్ జిల్లా గంహారియా పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళపై విధుల్లో ఉన్న పోలీస్ అధికారి అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్డీపీఓ అనుభవ్ భరద్వాజ్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని ఆయన శనివారం వెల్లడించారు. ఈ అఘాయిత్యంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.