చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఈటల రాజేందర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ధోబీ ఘాట్ లో నిర్వహించిన తెలంగాణ వీరనారి, ధీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకల్లో ఈటల రాజేందర్ పాల్గొని ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పౌరుషానికి, చైతన్యానికి చాకలి ఐలమ్మ గారు నిలువెత్తు సాక్ష్యమని ఆయన కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ఆత్మగౌరవ పోరాటాలకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.