ఇరాన్ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తామంటూ అమెరికా హెచ్చరిక
రిపోర్టర్: రమేష్
స్థలం: వరల్డ్
అమెరికా ఆంక్షల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇరాన్ విమాన సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోతాయని ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, మొత్తం దేశాన్ని తుడిచిపెట్టేసే అంశంపై ఆలోచిస్తున్నామని హెచ్చరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది.