అమెరికా-ఇరాన్ యుద్ధంతో పెరగనున్న ముడి చమురు ధరలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 100 డాలర్లకు సమీపించగా, ఇది 120 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులకు అంతరాయం కలగడంతో భారత్ సహా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.