తిరుమల బ్రహ్మోత్సవాలకు హైటెక్ భద్రత, ఏఐ కెమెరాల నిఘా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ హైటెక్ భద్రతా ఏర్పాట్లు చేసింది. 3000 సీసీ కెమెరాలు, 200 ఏఐ హెడ్ కౌంటింగ్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. గరుడ సేవల కోసం ప్రత్యేక నెట్‌వర్క్ స్లైసింగ్ సాంకేతికతను వాడుతున్నారు. భక్తుల భద్రత కోసం 5,300 మంది విజిలెన్స్ సిబ్బందిని రంగంలోకి దించారు.