విజయనగరం జిల్లాలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించినట్లు కలెక్టర్ విజయనగరం వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన రక్షణ సేవలను అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.