పోషకాహారంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమని అంకిరెడ్డిగూడెంలో నేతల పిలుపు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసం, పోషకాహార వారోత్సవాలను అంగన్వాడీ టీచర్లు నల్ల జయప్రద, చప్పిడి కల్పన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ వల్లందాస్ మహేష్‌గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాహారంపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బత్తుల అనూష, దొడ్ల అండాలు, ఆశా కార్యకర్త బొల్లు అండాలు, మహిళా సంఘం అధ్యక్షురాలు పెండెం లక్ష్మి, కోశాధికారి భీమగోని శోభ పాల్గొన్నారు.