విజయ్‌ దేవరకొండ రణబాలి టీజర్‌ అప్‌డేట్ వచ్చేసింది

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రణబాలి'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు రాజశేఖర్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న 'రౌడీ జనార్దన' షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది.