కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ
రిపోర్టర్: శివ
స్థలం: సిద్ధిపేట
సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ పరిధిలో ప్రభుత్వ గైరాన్ మరియు అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై రెవెన్యూ యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సర్వే నంబర్ 325లో సుమారు 10 ఎకరాల దళితులకు కేటాయించాల్సిన అసైన్డ్ భూమి ఫాంహౌస్ అవసరాలకు వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆదేశాల మేరకు ఇప్పటికే 180 నోటీసులు జారీ చేయగా, అధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.