మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమంటూ కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
రిపోర్టర్: గోపి
స్థలం: మంథని
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంథనిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మున్సిపల్ ఛైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడారు. పదేళ్ల కాలంలో పుట్టమధు ఎంత దోచుకున్నారో ప్రజలు గమనించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.