పెద్దూరులో మహిళల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు గ్రామంలో గురువారం రోజున సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది సంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ మహిళలు ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.