వైకోటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ జనసేన అభ్యర్థి పెంచలయ్య ప్రచారం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఓబులవారిపల్లి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామపంచాయతీ జనసేన ఎంపీటీసీ అభ్యర్థి కుప్పం పెంచలయ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగించారు. మంగళవారం గ్రామ వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్‌గా తన అనుభవంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండి వైకోటను ఆదర్శ గ్రామంగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు.