జాగృతి మిశ్రా ఆశ్రమం కూల్చివేత: జూనియర్ ఇంజనీర్ సస్పెన్షన్

రిపోర్టర్: హరి స్థలం: ఢిల్లీ

ఢిల్లీలో జంతు సంక్షేమ కార్యకర్త జాగృతి మిశ్రా నిర్మిస్తున్న ఆశ్రమాన్ని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేసిన ఘటనపై మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక జూనియర్ ఇంజనీర్ను సోమవారం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా పోలీసులను ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.