సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర వెలకట్టలేనిది: హెచ్ఎం చిన్నమనాయుడు

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి హెచ్ఎం చిన్నమనాయుడు నివాళులర్పించారు. సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తూ, సమూల మార్పుకు ఉపాధ్యాయులే కారకులని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.