ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై తక్షణమే స్పందించాలని అధికారులను డిమాండ్ చేసిన పసులేటి వెంకటేష్
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలో ఎంసిపిఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చెప్పేదొకటైతే బీఎల్ఓలు చెప్పేది మరొకలా ఉందని, ఎలాంటి పత్రాలు అడగకూడదో వాటిని కూడా ఇష్టం వచ్చినట్టు తేవాలని అడుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.