పూర్తయిన నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్, సెప్టెంబర్ 24న విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. తాజాగా విడుదలైన నాని రగ్డ్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. పీడిత ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.