అక్రెడిటేషన్ల కోసం హైదరాబాద్ లో కదంతొక్కిన కేబుల్ జర్నలిస్టులు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
కేబుల్ టీవీ చానళ్లకు అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఐఅండ్ పీఆర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, ఐపీ చానళ్ల పేరుతో అక్రెడిటేషన్లు నిరాకరించడం అన్యాయమన్నారు. అర్హత కలిగిన అన్ని కేబుల్ చానళ్లకు వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జర్నలిస్టు సంఘాల నాయకులు, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.