విజయవాడలో ఉపాధ్యాయులపై దాడి కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయవాడ
విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉపాధ్యాయులపై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. శాప్ డైరెక్టర్ సుధాబత్తుల సంతోష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రెండో ఏసీజేఎం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి గత నేరచరిత్ర ఆధారంగా ఇద్దరికి రిమాండ్ మంజూరు చేయగా, మిగిలిన వారి రిమాండ్ ను తిరస్కరించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.