అమెరికాలో ఘోర విమాన ప్రమాదం: నివాస ప్రాంతంలో ప్రైవేట్ జెట్ కుప్పకూలి తొమ్మిది మంది దుర్మరణం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమెరికా
అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. టెక్సాస్ నుంచి బహామాస్ వెళ్తున్న ప్రైవేట్ జెట్ నివాస ప్రాంతంలోని రోడ్డుపై కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాకపోకలు నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు.