ఆలేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం జోరు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి ఆన్లైన్ సెంటర్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఉచితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నమోదు ప్రక్రియకు అన్ని విధాలుగా సహకరిస్తామని వారు భరోసా కల్పించారు. పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.