సెప్టెంబర్ 7న బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం: కేసీఆర్ కీలక నిర్ణయం
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad, Telangana
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వైఖరిపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.