కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటూ కౌశిక్ రెడ్డి నిరసన

రిపోర్టర్: రాము స్థలం: హనుమకొండ

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన గళం విప్పారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న కాంగ్రెస్, వెయ్యి రోజులు గడిచినా మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి వంటావార్పు కార్యక్రమం చేపట్టి, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.