గాజువాక విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. సీసీ కెమెరా దృశ్యాలు వైరల్

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

గాజువాక పరిధిలోని చిన్న గంట్యాడలో ఐఐటీ-నీట్ కోచింగ్ విద్యార్థి రూపేశ్ మూడో అంతస్తు నుంచి దూకిన ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ వీడియో ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.

తీవ్ర గాయాలపాలైన రూపేశ్ ప్రస్తుతం ఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.