వైజాగ్ తాగునీటి సంక్షేమంపై కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మండిపాటు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలో తీవ్ర తాగునీటి కొరత ఏర్పడిందని, ప్రజలు మట్టి నీటిని తాగుతూ అల్లాడిపోతున్నారని వైఎస్సార్సీపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నీటి సంక్షేమాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియా ప్రజలను నిలువునా దోచుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నగర ప్రజలను దగా చేస్తున్న ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వెంటనే స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.