చెట్టుపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్లిన నాయకులు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల్ లో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలంటే కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.