భారీ సంచలనం: ఐఓఏ ఎన్నికల్ లో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ పురుష క్రీడాకారులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

భారత ఒలింపిక్స్ సంఘం ఎన్నికల్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుందని ఎన్నికల అధికారి సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. పురుషుల విభాగంలో పోటీ నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు వైదొలగడంతో గగన్ నారంగ్, కమలేష్ మెహతా, యోగేశ్వర్ దత్ మరియు విజేందర్ సింగ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నవంబర్ తొమ్మిదవ తేదీన జరగాల్సిన పురుషుల పోరు రద్దయిందని, మహిళా విభాగంలో మాత్రం ఆరుగురు క్రీడాకారిణుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.