పోషక విలువల ఆహారంతోనే ఆరోగ్యకరమైన భావి తరాలు
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: నెల్లూరు అర్బన్
పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీడీఎస్ కొండాయపాలెం సెక్టార్ సూపర్వైజర్ ఏ. ప్రమీలమ్మ సూచించారు. శనివారం నెల్లూరు అర్బన్ పరిధిలోని గిలకబావి సంఘం అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాస ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలన్నారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.