ప్రేమనే ఊరిలో చిత్రం నుంచి 'ఏరై పారే హృదయం' పాట విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని ‘ఏరై పారే హృదయం’ పాటను డా. సీహెచ్ ప్రీతిరెడ్డి విడుదల చేశారు. సమీరా భరద్వాజ్ ఆలపించిన ఈ పాట ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. శ్రీరామ్, రమిక శివు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.