ఖమ్మంలో కాంగ్రెస్ మాజీ డివిజన్ అధ్యక్షుల కీలక సమావేశం
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ డివిజన్ అధ్యక్షులందరూ రేపు ఉదయం పదకొండు గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన సంజీవరెడ్డి భవన్కు హాజరుకావాలని కోరారు. భవిష్యత్తు కార్యాచరణ, చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై జిల్లా అధ్యక్షుడితో చర్చించనున్నట్లు ఏలూరు రవికుమార్ తెలిపారు. పార్టీ ప్రణాళికల రూపకల్పనలో మాజీ అధ్యక్షులందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.