బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పనులు తుది దశకు చేరిక!

రిపోర్టర్: శివ స్థలం: చిత్తూరు

దేశంలోనే రెండో అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకుంటున్న బెంగళూరు-చెన్నై మార్గం పనులు చివరి దశకు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం-మొగిలి మధ్య ఏనుగుల సంచారం ఉన్న ప్రాంతంలో వాటి రక్షణ కోసం 60 మీటర్ల ఎత్తున భారీ పైవంతెన నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.